ది యాక్సిడెంటల్ ఫ్రైమ్ మినిస్టర్ సినిమా రివ్యూ

news02 Jan. 12, 2019, 9:31 a.m. entertainment

accidental

సినిమా- ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌

తారాగణం- అనుపమ్‌ ఖేర్‌, అక్షయ్‌ ఖన్నా, సుజానే బెర్నెట్‌, అర్జున్‌ మాథుర్‌‌, అహానా కుమ్రా

మ్యూజిక్- సుదీప్‌ రాయ్‌, సాధూ తివారీ

దర్శకుడు- విజయ్‌ రత్నాకర్‌ 

నిర్మాణ సంస్థ- పెన్‌ ఇండియా లిమిడెట్‌.

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2/5

పరిచయం..........

దేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తీసిన సినిమా ది యాక్సిడెంటల్ ఫ్రైమ్ మినిస్టర్. మన్మోహన్‌ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గర జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌ బారూ రాసిన ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు విజయ్‌ రత్నాకర్‌ తెరకెక్కించారు. ది యాక్సిడెంటల్ ఫ్రైమ్ మినిస్టర్ సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచీ చాలా వివాదాలు చలరేగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో  సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను గురించి తప్పుగా చూపించారని, వాస్తవాలను వక్రీకరించారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. సినిమా విడుదలకు ముందే తమకోసం ప్రత్యేకంగా సినిమా చూపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే అందుకు చిత్ర బృందం ససేమిరా అంది. మరి ఈ రోజు విడుదలైన ది యాక్సిడెంటల్ ఫ్రైమ్ మినిస్టర్ సినిమా ఎలా ఉందో చూసేద్దామా....

సినిమా కధ.......

కాంగ్రెస్‌ పార్టీ 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది. దీంతో ప్రధానమంత్రి కుర్చీపై ఎవరిని కుర్చోబెట్టాలా అని తర్జనభర్జనలు పడుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (సుజానే బెర్నెట్‌) మన్మోహన్‌సింగ్‌ను (అనుపమ్‌ ఖేర్) ప్రధానిగా ఎంపిక చేస్తారు. దేశ రాజకీయాల్లో ఈ విషయం కాస్త సంచలనం అవుతుంది. ఒక్క రోజులో మన్మోహన్‌ సింగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఇంతవరకు బాగనే ఉన్నా.. భారత ప్రధాని అయిన తర్వాత మన్మోహన్‌ సింగ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.. ఎవరి నిర్ణయాలను అమలు చేశారు.. ఆయనపై ఎవరెవరి ప్రభావం ఎక్కువగా ఉండేది అన్న అంశాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.....

acidental

అంతా ఇలా చేశారు...

సాధారనంగా ది యాక్సిడెంటల్ ఫ్రైమ్ మినిస్టర్ సినిమా పై అందరిలోను ఆసక్తి నెలకొంది. అన్ని బయోపిక్ ల కంటే కూడా మన్మోహన్‌సింగ్‌ స్టోరీ కాస్త ప్రత్యేకంగా ఉంటుందని అందరూ భావించారు. సంజయ్‌ బారు ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్ సో  ఏమైతే రాశారో అదే తెరపై చూపించారు. సినిమా మొత్తం ఓ సీరియల్ లా సాగిపోతుంది. మన్మోహన్ పాత్రను అంతా అనుకున్నట్లే చాలా బలహీనంగా చూపించారు. ఫ్యామిలీ ఆయన్ను నియంత్రించే తీరును కూడా ప్రస్తావించారు. సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక తదితరులు ఆయన వెనుక ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు. ప్రతి విషయంలో నిజాయితీగా, కచ్చితంగా ఉండే మన్మోహన్‌ తన పార్టీలో జరుగుతున్న అంళాలను పెద్దగా పట్టించుకోరు. 

అంతా ఇలా చేశారు.......

ది యాక్సిడెంటల్ ఫ్రైమ్ మినిస్టర్ సినిమాను ఎలాంటి తడబాటు లేకుండా ఓ పొలిటికల్‌ డ్రామాలా తీశాడు డైరెక్టర్. మన్మోహన్‌ సింగ్ పాత్రలో అనుపమ్‌ ఖేర్ చక్కగా ఒదిగిపోయారు. ఆయన మన్మోహన్ సింగ్ పాత్రలో కనిపించేందుకు ఎంత కష్టపడ్డారో తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. సంజయ్‌ బారూగా సీనియర్ నటుడు అక్షయ్‌ ఖన్నా నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఏఐసిసి అధ్యక్షులు రాహుల్‌ గాంధీగా అర్జున్‌ మథూర్‌ సైతం పరవాలేదనిపించారు. మరోవైపు ప్రియాంకా గాంధీగా అహానా కుమ్రా చాలా తక్కువ సమయం కనిపించారు. మన్మోహన్‌ సింగ్ సతీమణి పాత్రకు దివ్య సేత్‌ న్యాయం చేశారని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీగా సుజానా బెర్నెట్‌ చక్కగా ఒదిగిపోయారు. మొత్తానికి ది యాక్సిడెంటర్ ఫ్రైమ్ మినిస్టర్ సినిమా అనే కంటే ఓ డాక్యుమెంటరీ అంటే బావుంటుందేమో...

గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

tags: the accidental prime minister, the accidental prime minister review, the accidental prime minister movie review, the accidental prime minister rating

Related Post