నేడే మ‌హాన‌టి సినిమా విడుద‌ల‌

news02 May 9, 2018, 11:48 a.m. entertainment

mahanati
హైద‌రాబాద్: త‌న హావ‌భావాల‌తో పాత్ర‌ల‌కు ప్రాణం పోయ‌డంలో మ‌హాన‌టి సావిత్రి దిట్ట‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. త‌ను క‌ద‌ల‌కుండా క‌థ‌ను న‌డిపించ‌డంలో ఆమెకు మ‌రెవ్వ‌రూ సాటి రార‌ని ప్ర‌శంసించారు. సావిత్రి జీవిత గాధ నేప‌థ్యంలో తీసిన మ‌హాన‌టి చిత్రం నేడు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుద‌లవుతున్న సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్‌కు చిరు శుభాకాంక్ష‌లు చెప్పారు. 

mahanati

తెలుగు సినీ ప్రేక్ష‌కుల మ‌దిలో సావిత్రి న‌ట‌న చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌ని మెగాస్టార్ అన్నారు. చిత్ర పరిశ్రమలో ఎందరో న‌టీమ‌ణులున్నా... సావిత్రికి సాటెవ్వ‌రూ లేర‌న్నారు. త‌ను చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన తొలినాళ్ల‌లో సావిత్రితో క‌లిసి న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఆమెతో క‌లిసి న‌టీంచిన ఆ మ‌ధుర‌సృత్ముల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేన‌ని వెల్ల‌డించారు. కళ్లతోనే హావభావాలు పలికించి త‌న న‌ట‌న ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించేద‌ని ప్ర‌శంసించారు. నటిగా,వ్యక్తిగా, అమ్మగా, స్ఫూర్తి ప్ర‌దాత‌గా సావిత్రి త‌న మ‌న‌స్సులో ఎప్ప‌టికీ చిరంజీవిగానే మిగిలి ఉంటుంద‌న్నారు. 

mahanati

సావిత్రి జీవిత క‌థ ఆధారంగా మ‌హాన‌టి సినిమా తీయ‌డం గొప్ప విష‌యమ‌న్నారు. మ‌హాన‌టి మూవీ మంచి విజ‌యం సాధింస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈసంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు చెబుతున్న‌ట్లు చిరు వెల్ల‌డించారు. 

tags: mahanatimovie,chiru,savitri,alanatinati,hero,maa

Related Post