మా ఆయన బంగారం

news02 March 14, 2019, 7:13 p.m. entertainment

priyanka

అందాల భామ ప్రియాంకచోప్రాకు ఆమె భర్త నిక్ జోనాస్ విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. ఈ ముద్దు గుమ్మ ఇటీవల అమెరికాకు చెందిన పాప్ గాయకుడు నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవల నిక్ సోదరులు విడుదల చేసిన సూకర్స్ మ్యూజిక్ వీడియో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీంతో నిక్ జోనాస్ తన ప్రియమైన భార్య ప్రియాంకచోప్రాకు 2 కోట్ల 70 లక్షల రూపాయల మేబాచ్ మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడట. ఇంకేముంది తన ప్రియమైన భర్త ఇచ్చిన కారును చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయిన ప్రియాంక చోప్రా ప్రపంచంలో నా భర్త నంబర్ వన్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో కారుతో పాటు దిగిన ఫోటోలను పోస్టు చేసింది. ప్రయాంక కామెంట్ కు స్పందించిన నిక్ ఐ లవ్ యూ బేబీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు.

tags: priyanka, priyanka chopra, priyanka chopra hot, priyanka husband, priyanka husband gift,

Related Post