salman khan

సల్మాన్‌ ఖాన్ ను చంపేస్తాం

సల్మాన్‌ ఖాన్ ను చంపేస్తాం.. గ్యాంగ్ స్టర్ హెచ్చరిక

 

ముంబయి- బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌ ను చంపేస్తామని కరుడుగట్టిన గ్యాంగ్‌ స్టర్ గోల్డీ బ్రార్ హెచ్చరించడం కలకలం రేపుతోంది. సల్మాన్‌ తమ కిల్‌ లిస్ట్‌ లో ఉన్నాడని గోల్డీ బ్రార్ అన్నాడు. సల్మాన్‌ ఖాన్ ను చంపేస్తామని మార్చిలోనే మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్యూలో గ్యాంగ్‌ స్టర్‌ గోల్డీ బ్రార్ బహిరంగంగానే ఈ బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. పంజాబ్ సింగర్, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసే వాలా హత్యలో ‍గ్యాంగ్‌ స్టర్‌ గోల్డీ బ్రార్‌ కీలక సూత్రధారి అన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 

సల్మాన్ ఖాన్ సన్నిహితుడైన ప్రశాంత్ గుంజాల్కర్‌ కు మార్చిలో బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. హీరో సల్మాన్‌ ను చంపేస్తామని అందులో పేర్కొన్నాడు గోల్డీ బ్రార్. గతంలో అరెస్టైన లారెన్స్ భిష్ణోయ్‌ అంశంలో గోల్డీ బ్రార్‌ సల్మాన్‌ తో మాట్లాడాలనుకుంటున్నట్లు ఆ మెయిల్‌ లో కోరాడు. అప్పట్లో ఆ మెయిల్‌ లపై గ్యాంగ్‌ స్టర్‌ లారెన్స్ భిష్ణోయ్‌, గోల్డీ బ్రార్‌ లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఐతే గోల్డీ బ్రార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను కెనడాలో ఉన్నట్లు తెలుస్తోంది.
 


Comment As:

Comment (0)