వర్మకు భాద్యతులు అప్పగించాలన్న కోర్టు

news02 Jan. 8, 2019, 7:58 p.m. general

supreme

సీబీఐ అంతర్గత వ్యవహారానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం తనను బలవంతంగా సెలవుపై పంపించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా మధ్య వివాదాలు చలరేగడంతో వారిద్దరిని కేంద్రం గతేడాది సెలవుపై పంపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆలోక్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలోక్ వర్మ పిటీషన్ ను విచారించిన సుప్రీం కోర్టు సీబీఐ కేసులో కేంద్రం వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో సీసెంట్రల్ విజిలెన్స్ కమీషన్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు పక్కనబెట్టి.. సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి ఆలోక్‌ వర్మను తప్పించడాన్ని తప్పుబట్టింది. ఆలోక్‌ వర్మకు తిరిగి బాధ్యతలను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్నిసుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి వారంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

tags: cbi, cbi case, supreme court on cbi case, supreme court abou alok varma, supreme court on cbi alok varma

Related Post