తండ్రికి చిన్నారి చేత నివాళి..

news02 June 18, 2019, 10:48 p.m. general

jawan son

 

ఉగ్రవాదుల కాల్పుల్లో తన తండ్రి వీరమరణం పొందాడని తెలియని ఓ చిన్నారిని ఎత్తుకొని కన్నీటిపర్యంతమైన మరో ఉన్నతాధికారి ఫోటో సోషల్ మీడియాలో అందరి హృదయాలను కలిచివేస్తోంది. జమ్ముకశ్మీర్‌లో ఈనెల 12న భద్రతాబలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు చనిపోయారు. అందులో అనంతనాగ్‌ లోని సర్దార్‌ పోలీస్‌ స్టేషన్‌ లో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అర్షద్‌ ఖాన్‌ కూడా చనిపోయారు. దీంతో అర్షద్‌ మృతదేహాన్ని శ్రీనగర్‌కు తరలించారు. అక్కడ గవర్నర్‌తో పాటు పలువురు సైనికాధికారులు, పోలీసు అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న వీర జవాన్ అర్షద్‌ ఖాన్‌ నాలుగేళ్ల కుమారుణ్ని ఎత్తుకొని పోలీసు ఉన్నతాధికారి హసీబ్‌ మొఘల్‌ నివాళి అర్పింపజేశారు. ఆ సమయంలో ఆ చిన్నారిని చూసి ఉద్వేగం ఆపుకోలేక పోయిన హసీబ్‌ అతణ్ని పక్కకు తీసుకెళుతూ ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఈ ఫోటో అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. జై జవాన్
 

tags: jawan, jawan died in kashmir, veer jawan son, veer jawan son in kashmir, army officer with jawan son, jawan son floral tribute

Related Post