ఒకరోజు కూలి చేసి పేదలకు ఇచ్చిన సబ్ రిజిస్టర్

news02 Aug. 10, 2019, 7:17 p.m. general

Mulugu subrigistar dailywager

 ములుగు : సబ్ రిజిస్ట్రార్ కు అంటే చేతినిండా జీతం, పని తో బిజీ ..బిజీ గా వుంటారు. కొంత మంది అయితే లంచాలు తీసుకొని ఏసీ కార్లలో తిరుగుతారు. కానీ ఈ సబ్ రిజిస్టర్ డిఫరెంట్. తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా .. హోదాను పక్కన పెట్టీ పొలం లోకి దిగారు. ఇక వివరాల్లోకి వెళితే...

Mulugu subrigistar thaslima

రామచంద్రపురం గ్రామానికి చెందిన తస్లీమా ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్నారు. రెండో శనివారం సెలవు దినం కావడంతో తన స్వగ్రామం ములుగు మండలం రామచంద్రపురం గ్రామంలో... అదే గ్రామానికి చెందిన కౌలు రైతు రాఘవరెడ్డి నీలమ్మ దంపతుల వ్యవసాయ భూమి లో దినసరి కూలికి వెళ్ళింది. గత ఐదు సంవత్సరాలుగా ఆమె అప్పుడప్పుడు కూలికి వెళ్తున్నట్లు సమాచారం.

Mulugu subrigistar thaslima for poor peopleMulugu subrigistar thaslima

ఎప్పటిలాగే ఈసారి కూడా దినసరి కూలీగా మహిళలతో కలిసి పొలం పనులు చేస్తూ వరి నాట్లు వేసింది. వారితోనే కలిసి మధ్యాహ్నం వారితో కలసి పొలం వద్ద భోజనం చేసారు. ఈ సందర్బంగా భూ యజమాని రాఘవరెడ్డి ... సబ్ రిజిస్ట్రార్ తస్లిమాకు కూలి 250 రూపాయలు అందజేశారు. అనంతరం గ్రామంలో వృద్ధాప్యంలో కూడా కుటుంబాన్ని పోషిస్తున్న చాకలి సారమ్మకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్బంగా తస్లిమా గారు మాట్లాడు తాను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగాను అని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో రైతు జీవితమే అత్యున్నతమైన జీవితమని వారు లేకుంటే నేడు ఈ దేశానికె అన్నం లేదన్నారు అలాంటి రైతును ప్రతి ఒక్కరు గౌరవించి సమాజంలో సముచిత స్థానం కల్పించాలన్నారు.

tags: Mulugu subrigistar, mulugu District collector, TRS working president, TRS president, daily eager, telangana irrigation, Telangana formers, role model officers, suregistar

Related Post