టాలీవుడ్ లో మరో విషాదం

news02 March 12, 2018, 2:14 p.m. general

టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ (78) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసారు. కొంతకాలంగా ఆయన శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 1940 డిసెంబర్ 28న విశాఖపట్నంలో సత్యనారాయణ జన్మించారు. ఆయన విశాఖలోని కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. సత్యనారాయణ  ‘నీడలేని ఆడది’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. సీతామాలక్ష్మీ, శ్రీనివాస కల్యాణం, శుభలేఖ, దొంగ కోళ్లు, ఊరికి ఇచ్చినమాట, విజేత వంటి చిత్రాలతో సుమారు 180కిపైగా చిత్రాల్లో నటించారు. కాగా వంకాయల సత్యనారాయణ మృతి పట్ల పలువురు నటులు సంతాపం తెలిపారు.

 

Related Post