ముంబై సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో శ్రీదేవి భౌతికకాయం

news02 Feb. 28, 2018, 10:17 a.m. general

నటి శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె కుటుంబసభ్యులు గ్రీన్ ఎకర్స్ లోని ఆమె ఇంటి నుంచి ముంబై సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ కు తరలించారు. అతిలోక సుందరి శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ కు అభిమానులు క్యూ కట్టారు. మరోవైపు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు శ్రీదేవిని చివరి సారి చూసేందుకు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ప్రజల సందర్శనకు అనుమతిస్తారు. 2 గంటలకు శ్రీదేవి అంతిమయాత్ర మొదలవుతుంది. 3:30 నిముషాలకు విలేపార్లే హిందూ స్మశానవాటికలో శ్రీదేవికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమ అభిమాన నటిని భౌతికంగా ఇక చూడలేమని .. కడసారి అయినా ఆమెను కనులారా వీక్షించాలని పెద్ద ఎత్తున అభిమానులు సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ కు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Post