రెచ్చిపోతున్న ప్రేమికులు

news02 Feb. 8, 2019, 8:30 a.m. general

kiss

హైదరాబాద్ మెట్రోరైలు స్టేషన్లు ఇప్పుడు నగర ప్రేమికులకు లవ్ పార్కులుగా మారాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ల్లో ప్రేమికులు సరససల్లాపాల్లో తెలిపోతున్నారు. మెట్రో స్టేషన్ లిప్ఠుల్లో ప్రేమికుల ముద్దు దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఇంకేముందు యువ జంటల ముద్దు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  మెట్రో రైల్ స్టేషన్ లోని అణువనువు సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. మెట్రోకు వచ్చే ప్రయాణికుల కదలికలను ఉప్పల్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి 24 గంటలు పర్యవేక్షిస్తుంటారు. ఇలా మెట్రో స్టేషన్ లిప్టుల్లో కామ కలాపాలను గుర్తించిన మెట్రో అధికారులు అవాక్కయ్యారు. ఈ మేరకు ఇప్పటికే స్టేషన్లలో ఏకాంతంగా ఉండే ప్రదేశాల్లో హుందాగా ఉండాలనే సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. లిఫ్టుల్లో ముద్దు సన్నివేశాల వీడియోలు వైరల్‌గా మారడంతో మెట్రో అధికారుల దీనిపై దృష్టి సారించారు. ఈ అంశంపై విచారణ జరపడంతో పాటు ఇకపై మెట్రో స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు.

tags: kiss, kissing in metro, kissing in metro lifts, lovers kiss in metro lifts, lovers kissing in metro lifts

Related Post