ఇజ్రాయిల్ స్పేస్ క్రాఫ్ట్ అద్భుతం

news02 March 6, 2019, 7:55 p.m. general

isreal aircraft selfie

భూమిపై నుంచి సుమారు 20వేల మైళ్ల దూరం నుంచి సెల్ఫీ తీస్తే ఎలా ఉంటుంది. ఇది మన ఉహకే అందని విషయం. 20 వేల మైళ్లంటే ఏకంగా 37వేల కిలోమీటర్లు అన్నమాట. వామ్మో అంత దూరం నుంచి సెల్ఫీనా.. ఏంటి కధలు చెబుతున్నారా అని అనుకుంటున్నారా.. ఇది నిజమండీ బాబు. చంద్రునిపై అడుగుపెట్టబోతున్న తొలి ఇజ్రాయెల్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలో తన మొదటి సెల్ఫీని తీసింది. 37వేల కిలోమీటర్ల దూరం నుంచి తీసిని ఈ సెల్ఫీలో రోబోటిక్‌ లాండర్‌తోపాటు వెనుకభాగంలో వెలిగిపోతున్న భూమి స్పష్టంగా కనిపించింది. బేర్‌ షీట్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలో తీసిన ఈ సెల్ఫీలో భూమిపై ఆస్ట్రేలియా భూభాగం స్పష్టం కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన తొలి మూన్‌ లాండర్‌ను ఫ్లోరిడాలోని కేఫ్‌ కానవెరాల్‌ నుంచి రెండు వారాల క్రితం విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఏప్రిల్‌ 11న చంద్రునిపై దిగనుంది. 585 కిలోల బరువున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా పంపించారు. ఏదేమైనా అంత దూరం నుంచి స్పేస్ క్రాఫ్ట్ సెల్ఫీ తీయడం మాత్రం అద్భుతం అని చెప్పక తప్పదు.

tags: israel space craft selfie, space craft selfie, israel space craft selfie pic, space craft selfie photo

Related Post