కికి పిల్ల చేష్ట‌ల‌కు కోర్టు స‌రైన శిక్ష‌

news02 Aug. 10, 2018, 12:02 p.m. general

kiki challege

ముంబాయి:దేశమంతా ఇప్పుడు కికి చాలెంజ్ ఫివ‌ర్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. న‌డుస్తున్న కారులో నుంచి కింద‌కు దిగి డ్యాన్స్ చేసి మళ్లీ కారు ఎక్క‌డ‌మే కికి చాలెంజ్‌.ఇప్పుడిదే దేశంలో చాలా పాపుల‌రే అయిపోయింది. పోటీ ప‌డి చాలా మంది కుర్రాళ్లు కికి చాలెంజ్‌ను స్వీక‌రిస్తున్నారు. అయితే ఈ నేప‌థ్య‌లోనే కికి చాలెంజ్‌ను కొత్త‌గా చేయాల‌నుకున్నారో ఏమో.. మ‌హారాష్ట్రలోని కొంద‌రు కుర్రాళ్లు వినూత్న ప్ర‌యోగానికి య‌త్నించ‌డం వారిని క‌ట‌క‌టాల‌పాలు చేసింది.

kiki
మ‌హారాష్ట్ర విరార్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువ‌కులు  కికి చాలెంజ్‌కు కారును కాకుండా రైలును ఎంచుకున్నారు. నిషాంత్‌ షా(20), ధృవ్‌ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువ‌కులు న‌డుస్తున్న రైలు నుంచి కింద‌కు దిగి ప్లాట్‌ఫాంపైకి దూకిన కాసేపు డ్యాన్స్ చేశారు. అనంత‌రం మ‌ళ్లీ రైలెక్కి స్టేష‌న్‌లో హ‌ల్‌చ‌ల్ చేశారు. అంతేకాదు ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలోనూ పెట్టేశారు. అయితే ఈ వీడియోలు కాస్తా ఇప్పుడు రైల్వే పోలీసుల దృష్టికి చేర‌డంతో... స‌ద‌రు కుర్రాళ్ల‌ను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజ‌రుప‌రిచారు.

kiki

అయితే ఈ కేసును విచారించిన కోర్టు వీరికి వినూత్న ప‌ద్ధ‌తిలో శిక్ష వేయ‌డం విశేషం. ప్ర‌మాద‌క‌రంగా కికి డ్యాన్స్ చేసినందుకు వారానికి 3సార్లు విసాయ్ స్టేష‌న్‌ను శుభ్రం చేయాల‌ని ఆదేశించింది. అంతేకాదు వారు స్టేష‌న్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు వీడియో తీసి దానిని కోర్టుకు సమర్పించాలని ఆర్పీఎఫ్ పోలీసుల‌కు సూచించింది. మొత్తానికి కారు కికి చాలెంజ్‌పైనే పోలీసులు అభ్యంత‌రం చెబుతున్న వేళ‌.. రైల్వే స్టేష‌న్‌లో కికి చాలెంజ్‌ పేరుతో పిల్ల చేష్ట‌లు చేసిన‌ కుర్రాళ్ల‌కు వారి ప‌ద్ధ‌తిలోనే కోర్టు శిక్ష‌లు ఖ‌రారు చేయ‌డం కొస‌మెరుపు.

tags: kiki challenge,vishay railway station,rpf police,maharastra,kiki,railway kiki,railway court,kiki challenge, kiki challenge fail,kiki challenge song,kiki challenge youtube,kiki challenge original kiki challenge lyrics,kiki challenge drake,kiki challenge will smith, kiki challenge winner,kiki challenge hit by car,kiki challenge farmers, kiki challenge video,kiki challenge shiggy,kiki challenge kids,kiki challenge walmart kiki challenge accident,kiki challenge astros,kiki challenge airplane, kiki challenge at walmart,kiki challenge animals,kiki challenge army, kiki challenge accident death,kiki challenge avocado,kiki challenge arrested kiki challenge best,kiki challenge bloopers,kiki challenge barstool, kiki challenge black kid,kiki challenge by dentist,kiki challenge by celebrities kiki challenge buzzfeed,kiki challenge bike,kiki challenge beginning, kiki challenge by car,kiki challenge celebrities,kiki challenge car,kiki challenge car crash kiki challenge cops,kiki challenge car fail,ki

Related Post