పెళ్లి జరిపించిన పంతులుతోనే

news02 May 30, 2019, 8:33 a.m. general

bride

పెళ్లైన మూడో రోజే తనకు వివాహం జరిపించిన పంతులుతో వెళ్లిపోయిందో యువతి. సాధారనంగా ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనే జరుగుతుంటాయి. కానీ పెళ్లి చేసిన పంతులుతోనే వెళ్లిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని అసత్‌ గ్రామానికి చెందిన ఓ 21 ఏళ్ల యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడికి ఈనెల 7న వివాహం జరిగింది. వీరి పెళ్లిని ఇదే ప్రాంతానికి చెందిన వినోద్‌ మహారాజ్‌ అనే పంతులు జరిపించాడు. పెళ్లయిన మూడో రోజే పుట్టింట్లో కొన్ని రోజలు ఉండి వస్తానని చెప్పి వెళ్లింది సదరు కొత్త పెళ్లి కూతురు. ఆ తర్వాత పంతులు వినోద్ మహరాజ్, కొత్త పెళ్లి కూతురు కనిపించకుండా పోయారు. ఇక వెళ్తూ వెళ్తూ సదరు వివాహిత ఇంటి నుంచి 1 లక్షా 50 వేల రూపాయల విలువ చేసే బంగారం, 30వేల రూపాయల నగదు కూడా పట్టుకుపోయింది. వివాహితుడైన వినోద్‌కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా ఇలా పెళ్లి జరిపించిన పంతులుతోనే పెళ్లి కూతురు వెళ్లిపోవడాన్ని మాత్రం గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.

tags: bride elopes with priest woh performed wedding rituals, MP woman elopes with , MP Woman Elopes With Priest Who Performed Her Wedding Rites

Related Post