ఈశా ఆనంద్ లకు లతా గిఫ్ట్

news02 Dec. 17, 2018, 7:13 a.m. general

lata

భారత రత్న లతా మంగేష్కర్ పాటలు పాడక చాలా ఏళ్లవుతోంది. ఈ గాన కోకిల ఇన్నాళ్లకు ఓ చిన్న పాట పాడింది. అది కూడా అంబాని గారాల పట్టి ఈశా కోసం. నవ దంపతులు ఈశా అంబానీ, ఆనంద్‌ పిరామల్‌ లకు లతా మంగేష్కర్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరి వివాహ వేడుకకు లతా మంగేష్కర్ రాలేకపోయారు. ఈ నేపథ్యంలో తనదైన శైలిలో లతా కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు. 

lata

ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రం, వినాయక స్తుతి ఆలపించి వాటిని ఈశా-ఆనంద్‌లకు అంకితం చేశారు లతా మంగేష్కర్. లతా పాడిన పాటలను ఈశా పెళ్లి వేడుకలో ప్రసారం చేశారు. ఇక డిసెంబర్‌ 12న ఈశా-ఆనంద్‌ల పెళ్లి ముంబయిలోని ముఖేశ్‌ నివాసం యాంటీలియాలో అట్టహాసంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు.

tags: lata, lata mangeshkar, lata mangeshkar song, lata mangeshkar song for isha, lata mangeshkar song for isha ambani, lata mangeshkar gayatri mantra for isha ambani

Related Post