సౌందర్య పై నెటిజన్ల ఆగ్రహం

news02 July 2, 2019, 6:55 p.m. general

soundarya

ప్రముఖ నటుడు.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం తాగడానికి గుక్కెడు నీరు లేక తమిళనాడు ప్రజలు అల్లాడిపోతున్ననేపథ్యంలో సౌందర్య తన కుమారుడు వేద్‌తో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. పిల్లలకు ఈత నేర్పడం ద్వారా వారు చాలా ఫిట్‌గా, చురుగ్గా ఉంటారని చెప్పుకొచ్చింది. అయితే సౌందర్య ట్వీట్‌పై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైలో తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడుతుంటే.. స్విమ్మింగ్‌ చేయడానికి నీరు కావాలా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సౌందర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాస్త ఆలస్యంగా తేరుకున్న సౌందర్య ఆ ఫొటోను వెంటనే తొలగించింది. ప్రస్తుతం చెన్నైలో కొనసాగుతున్న నీటి కొరత సమస్యను దృష్టిలో పెట్టుకుని నేను పోస్ట్‌ చేసిన ఫొటోను తొలగిస్తున్నాను.. పిల్లలకు చిన్న వయసు నుంచే వ్యాయామాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఆ ఫొటోను పోస్ట్‌ చేశాను.. నీటిని కాపాడుకుందా అని వివరణ ఇచ్చింది సౌందర్య. దీంతో నెటిజన్లు కాస్త శాంతించారు.

 

tags: soundarya, soundarya rajinikanth, soundarya rajinikanth swimming, rajinikanth daughter soundarya swimming,

Related Post