ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్

news02 March 14, 2018, 5:38 p.m. general

 

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌(76) ఇక లేరు. బుధవారం ఉదయం లండన్  కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. స్టీఫెన్ పూర్తి పేరు స్టీఫెన్ విలియమ్ హాకింగ్. 1942 జనవరి 8న ఇంగ్లాండ్లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ నుంచి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన స్టీఫెన్.. భౌతికశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు.

1963లో ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకునే రోజుల్లో స్టీఫెన్ ఒక రోజు మెట్ల మీద నుంచి పడిపోయారు. ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికి  ఆయన మోటార్‌ న్యూరాన్‌ వ్యాధికి గురైనట్లు వైద్యులు గుర్తించారు. దీని కారణంగా శరీరం నెమ్మదిగా పక్షవాతానికి గురవుతుంది. ఆ సమయంలో స్టీఫెన్ రెండేళ్లు మాత్రమే బ్రతుకుతారని వైద్యులు వెల్లడించారు. 21 ఏళ్ల వయసులో చక్రాల కుర్చీకే పరిమితం అయిన స్టీఫెన్ విధిని ఎదిరించి చక్రాల కుర్చీలో .. కదలలేని స్థితిలో కూడా తన పరిశోధనలు చేశారు. చివరిక మాట రాని పరిస్థితిలో సైతం సంజ్ఞలు చేసేవారు. ఆయన రూపొందించిన ఓ కమ్యూనికేషన్ డివైజ్ ద్వారా అవి అక్షర రూపంలోకి మారేవి. 2005 నుంచి తన చెంప కండరాల ద్వారా కమ్యూనికేషన్ డివైజ్ కంట్రోల్ చేశారు. దశాబ్దాల పాటు చక్రాల కుర్చీలో గడిపిన స్టీఫెన్ తుది శ్వాస విడిచారు. హాకింగ్ మృతిపట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

 

tags: stephen hawkings, theoreticalphysicist,Cambridge, scientist

Related Post