జీతాలు పెంచేదే లేదు.. మీకు ఇదే ఎక్కువ

news02 May 16, 2018, 6:19 a.m. general

Cm kcr rtc drivers

హైదరాబాద్ : కొన్ని రోజులుగా తమ డిమాండ్ లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం గుర్తింపు సంఘం నాయకులతో రెండు సార్లు చర్చలు కూడా జరిపారు. అయితే మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పై సీఎం కేసీఆర్ స్పందన ఇది.

*RTC ఉద్యోగుల జీతాలు పెంచలేం....తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్..*

ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది.... జీతాలు పెంచాలని RTC యూనియన్ లు నోటీస్ లు ఇవ్వడం కరెక్ట్ కాదన్న సీఎం. మిగతా రాష్ట్రాల్లో పోల్చుకుంటే తెలంగాణ RTC లో జీతాలు చాలా ఎక్కువే ..

అనాలోచితంగా వారు డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇవ్వడం ఉద్యోగుల కు తగదు. ఆర్టీసీ ఉద్యోగులు కోరిన స్థాయిలో జీతాలు పెంచినట్లైతే ప్రస్తుతం ఏడాదికి వారి జీతాలపై ఖర్చు చేస్తున్న 2400 కోట్లకు అదనంగా మరో 1400 కోట్లు సంవత్సరానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి పొరుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల ఉద్యోగుల జీతబత్యాలతో పోల్చి చూస్తే టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఎక్కువ.

ఉదాహారణకు ఆర్టీసీ డ్రైవర్ జీతం తీసుకుంటే తెలంగాణలో కనీస మూలవేతనం రూ. 12,610 ఉండగా, కర్ణాటకలో అంతకంటే తక్కువగా రూ. 11610 , మహారాష్ట్రలో రూ.4350 మాత్రమే ఉంది. తమిళనాడులో కూడా తెలంగాణ కంటే తక్కువేనని సీఎం దృష్టికి తెచ్చినా ఆర్టీసీ అధికారులు.

కేవలం జీతబత్యాల మీదనే ఆర్టీసీ సంస్థ తన ఆదాయంలో 52 శాతం పైగా ఖర్చు పెడుతున్నది. మరే ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇంత పెద్ద మొత్తంలో జీతాల మీద ఖర్చు పెట్టడంలేదు.

2014-15లో 44శాతం ఫిట్ మెంట్ ప్రకటించినప్పుడు ఆర్టీసీ సంస్థను లాభాల్లో నడిపిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హామి ఇచ్చారు. కానీ ఆ హామీకి విరుద్ధంగా 2014-15లో రూ.400 కోట్లకు పైగా 2015-16లో రూ.776 కోట్లకు పైగా, 2016-17లో రూ. 750 కోట్ల మేరకు, 2017- 2018లో రూ.680 కోట్ల మేరకు సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది ఇవేవీ గమనించ కుండా మళ్లీ జీతాలు పెంచమని డిమాండ్ చేయడాన్ని అధికారులు, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, ముఖ్యమంత్రి తప్పుబట్టారు.

ఇది అసమంజసమైన డిమాండ్. నష్టాల్లో నిరంతరం కూరుకుపోతున్న ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం నడపాలా వద్దా అని ఉద్యోగులు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.

Related Post