300 మంది ఉగ్రవాదులు హతం

news02 Feb. 26, 2019, 9:48 p.m. general

surgical strike

జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడికి మన దేశం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి చేసింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన బాంబులతో విరుచుకుపడింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు ఉన్న లేజర్‌ గైడెడ్‌ బాంబులతో ఉగ్రక్యాంపులపై దాడి చేసింది. మొత్తం 12 మిరాజ్‌-2000 జైట్‌ ఫైటర్స్‌తో ఆ దాడులు నిర్వహించారు. భారత వైమానిక దళం పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన ఈ దాడులు వంద శాతం సక్సెస్ అయ్యాయని అధికారులు చెప్పారు. 

surgical stirke2

ముందుగా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం దాడులు అనుకున్నట్లు జరిగాయని తెలిపారు. వైమానిక దళ ఫైటర్‌ జెట్స్‌ ఎల్‌ఓసీ దాటి ఈ దాడులు నిర్వహించాయని వివరించారు. పాకిస్థాన్ భూబాగంలోని బాలాకోట్‌, చకోటీ, ముజఫరాబాద్‌లో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశామని తెలిపారు. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆల్ఫా-3 నియంత్రణ కేంద్రాలను ధ్వంసం చేశాయని అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. 

tags: surgical strike2, surgical strike, indian air force attack, indian airforce attack on pakistan, indian air force attack on terrorists camps

Related Post