కొలొంబో పేలుళ్లలో 139 మృతి

news02 April 21, 2019, 8:48 p.m. general

srilanka blasts

 శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 139 మంది మృతిచెందినట్లు సమచారం. మరో 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈస్టర్‌ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడ్డారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 45 నిమిషఆల ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితో పాటు మూడు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బాంబులు పేలాయి.

colombo

కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరి హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. శ్రీలంకలోని భారత అధికారులతో మాట్లాడామన్నారు. అటు శ్రీలంక ప్రధాని రాజపక్సే పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాలను ఆయన సందర్శించారు.

tags: srilanka, colombo, srilanka blasts, srilanka bomb blasts, colombo blasts, colombo bomb blasts, 139 died in colombo blasts

Related Post