ఎంత చలించిపోయాడు

news02 April 25, 2019, 3:14 p.m. general

boy

పిల్లలు దేవుడూ చల్లని వారే.. కల్ల కపటమెరుగని కరణామయులే అని ఉరికే అన్నారా.. నిజంగా పిల్లులు దేలుడితో సమానం. దీన్ని సార్దకం చేసే ఓ ఘటన వెలుగు చూసింది. చిన్న పిల్లల మనసులు ఎంత స్వచ్ఛమైనవవో మరోసారి రుజువైంది. పసివారికి అమాయకత్వం పెట్టని ఆభరణం. అసలు విషయానికి వస్తే.. ధీరజ్‌ ఛెత్రి అనే వ్యక్తి సైనిక విధుల్లో భాగంగా మిజోరంలో ఉంటున్నాడు. ఆయనకు డెరెక్‌ సీ అనే ఆరేళ్ల ముద్దుల కొడుకు ఉన్నాడు. ఆ పసివాడు ఇంటి ముందు ఆడుకుంటుంటుండగా అనుకోకుండా పక్కింటివాళ్ల కోడిపిల్లపై నుంచి తన సైకిల్‌ వెళ్లింది. దీంతో ఆ కోడి పిల్ల అక్కడికక్కడే చనిపోయింది. ఐతే కోడి పిల్ల చనిపోయిందన్న విషయం తెలియని డెరెక్‌ కోడిపిల్లని తీసుకుని ఇంట్లోకి వెళ్లి.. దాన్ని ఆసుపత్రి తీసుకెళ్లి చికిత్స చేయించాలని తన ముద్దు ముద్దు మాటలతో చెప్పాడు. 

boy

దీంతో పిల్లవాడి తండ్రి ధీరజ్‌ ముచ్చటపడి.. నువ్వే ఆసుపత్రికి తీసుకెళ్లు అని చెప్పడంతో.. వెంటనే తాను దాచుకున్న 10 రూపాయల నోటు తీసుకొని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడున్న డాక్టర్ దగ్గరకు వెళ్లి కోడి పిల్లకు చికిత్స చేయాలని అడిగాడు. ఓ చేతిలో కోడిపిల్ల, మరోచేతిలో 10 నోటుతో ఉన్న డెరెక్‌ను ఆస్పత్రిలోని నర్స్ ఫొటో తీసింది. ఆ తరువాత డెరక్ ను ఇంటికి పంపించేశారు. దీంతో ఏడుస్తూ ఇంటికి వచ్చిన డెరెక్‌ కోడిపిల్ల చికిత్సకు 100 రూపాయలు కావాలని అడిగాడు. దీంతో కోడి పిల్ల చనిపోయిందని తల్లిదండ్రులు అతనికి అర్దమయ్యేలా వివరించారు. కోడి పిల్ల కోసం ఆ పసివాడు పడ్డ తపన అందరిని కట్టిపడేసింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

tags: boy, aboy, boy about chick, a boy about chik, derak about chick, boy derak about chick health

Related Post