కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు తొల‌గిన అడ్డంకులు

news02 Feb. 23, 2018, 5 p.m. general

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖ‌లైన పిటిష‌న్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముంపు గ్రామాల్లో సరైన చర్యలు చేపట్టకుండా పనులు చేస్తున్నారని సుప్రీంకోర్టులో హయత్‌ఉద్దీన్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. చెన్నై బెంచ్‌ నుంచి ఢిల్లీకి ఎందుకు వచ్చారని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోరం హంటింగ్‌ చేస్తున్నారా? అంటూ మందలించింది. కేసు దాఖలులోనే ఆలస్యం చేశారని పేర్కొంది. ఒక చోట కాకపోతే మరోచోటికి వస్తారా? అని ప్రశ్నించింది. కేసు విచారణకు అర్హం కాదంటూ తిరస్కరించింది.

tags: supremecourt, telangana, kaleswaramproject, trs, congress

Related Post