శ్రీదేవి మ‌ర‌ణంపై వైద్యులు ఇలా చెప్పారు

news02 Feb. 25, 2018, 12:08 p.m. general

అందానికి నిలువెత్తు నిదర్శ‌నం శ్రీదేవి... 54 ఏళ్ల వ‌య‌సులో ఆమె మ‌ర‌ణం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఎటువంటి అనారోగ్యం లేని శ్రీదేవికి అక‌స్మాత్తుగా గుండెపోటు రావ‌డం.. వ‌స్తూనే చ‌నిపోవ‌డం ... ఎందుకిలా జ‌రిగింది? .. కోట్లాదిమంది అభిమానుల్లో ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి. త‌న అందాన్ని కాపాడుకోవ‌డం కోసం  చేయించుకున్న  శ‌స్త్ర చికిత్స‌లు.. క‌ఠిన‌మైన ఆహార‌నియ‌మాలే శ్రీదేవి ప్రాణాలు తీసాయ‌నే చ‌ర్చ మొద‌లైంది. 

శ్రీదేవి ఇప్ప‌టి హీరోయిన్ల‌కు కూడా ఏమాత్రం తీసిపోకుండా అందాన్ని కాపాడుకుంటూ వ‌చ్చారు. అందుకోసం అనేక శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకున్నారని చెబుతారు. 1990లోనే శ్రీదేవి త‌న ముక్కుకు స‌ర్జ‌రీ చేయించుకున్నారు. ఆ త‌రువాత ఫిట్ నెస్ కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర్నుంచి శ‌స్త్ర చికిత్స‌ల‌తో అందాన్ని మ‌రింత పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించార‌ని తెలుస్తోంది. ఫేస్ లిఫ్టింగ్, బ్రెస్ట్ ఇంప్లాంటేష‌న్ వంటి ఆప‌రేష‌న్లు శ్రీదేవి చేయించుకున్న‌ట్లు స‌మాచారం.ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఫంక్ష‌న్ కు శ్రీదేవి హాజైన‌పుడు పెద‌వులు వాచి ఉన్నాయ‌ని.. ఆప‌రేష‌న్ విక‌టించింద‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. ఇక శ్రీదేవి బ‌రువు పెర‌గ‌డంతో లైపో స‌క్ష‌న్ స‌ర్జ‌రీ కూడా చేయించుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ఆప‌రేష‌న్ల కార‌ణంగా శ్రీదేవికి మాన‌సిక ఒత్తిడి పెరిగి ఉండ‌వ‌చ్చ‌ని.. వాటికి తోడు క‌ఠిన‌మైన ఆహార నియ‌మాలు కూడా గుండెపోటు రావ‌డానికి కార‌ణంగా క‌నిపిస్తున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు.


ఇవ‌న్నీ వింటుంటే  వీటిలో కొన్నైనా  ఆమె మ‌ర‌ణానికి కార‌ణాలు అయి ఉండ‌వ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తోంది. ఏది ఏమైనా మ‌రికొంత‌కాలం జీవించాల్సిన వ‌య‌సులో ఇంత త్వ‌ర‌గా శ్రీదేవికి మ‌ర‌ణం ముంచుకు రావ‌డం అటు సినీ ఇండ‌స్ట్రీనీ, ఇటు అభిమానుల్ని తీవ్ర వేద‌న‌కు గురి చేస్తోంది. 

tags: sridevi, death, heartattack, bollywood, heroine

Related Post