చారిత్ర‌క క‌ట్ట‌డాల ద‌త్త‌త‌కు కేంద్రం ఒకే

news02 May 1, 2018, 12:07 p.m. general

charminar adaption

హైద‌రాబాద్: చారిత్ర‌క‌, సాంస్కృతిక‌, వార‌స‌త్వ నేప‌థ్యమున్న క‌ట్ట‌డాల‌ను కాపాడేందుకు కేంద్రం న‌డుం బిగించింది.  కేంద్ర పర్యాటకశాఖ నేతృత్వంలో సాంస్కృతిక శాఖ, భారత పురావస్తు విభాగం ASIతో కలిసి దేశ వ్యాప్తంగా ఉన్న వారసత్వ, సాంస్కృతిక  కట్టడాలను సంర‌క్షించేందుకు సిద్ధ‌మైంది. ఈమేర‌కు కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థలకు ఈబాధ్య‌త‌ల‌ను అప్ప‌గించేందుకు రంగం సిద్ధ‌మైంది. ఐదేళ్ల‌పాటు వీటిని అభివృద్ధి చేసి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను కేంద్ర స‌ర్కారు అప్ప‌గించ‌నుంది. 

ద‌త్త‌త జాబితాలో హైద‌రాబాద్ కు ప్ర‌త్యేక స్థానం ద‌క్క‌డం విశేషం. భాగ్య‌న‌గ‌రం నుంచి చార్మినార్, గోల్కొండ కోటల‌ను కేంద్రం ఈలిస్టులో చేర్చింది. ఫ‌లితంగా చార్మినార్‌, ఎర్ర‌కోట కొత్త రూపు సంత‌రించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ITC హోటల్స్ కు చార్మినార్‌ను, GMR స్పోర్ట్స్ ఫ్రైవేట్ లిమిటెడ్ గోల్కొండ కోటను ద‌త్త‌త తీసుకొనున్న‌ట్లు స‌మాచారం.  ఈమేర‌కు ఈరెండు క‌ట్ట‌డాల‌ను వాటికి అప్ప‌గించి వాటి విశిష్ట‌త‌ను మ‌రింత పెంచేలా చ‌ర్య‌లు తీసుకొనున్న‌ట్లు తెలుస్తోంది. ఉమ్మ‌డి ఏపీలో మొత్తం  7 క‌ట్ట‌డాల‌ను ద‌త్త‌త జాబితాలో కేంద్రం స‌ర్కారు చేర్చిన‌ట్లు స‌మాచారం. చార్మినార్, గోల్కొండతో పాటు గండికోట, రామప్ప, ఉండవల్లి గుహలు, హిందూ దేవాలయం కడప గండికోట ఈజాబితాలో ఉన్నాయి. 

tags: adaption,centralgovt,charminar,golkonda,

Related Post