మంత్రి అఖిలప్రియ నిశ్చితార్థం

news02 May 12, 2018, 12:57 p.m. general

akhila priya marriage
హైద‌రాబాద్: దివంగ‌త ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి కుమార్తె ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమ అఖిల ప్రియ పెళ్లి కూతురు కాబోతుంది. మంత్రి నారాయ‌ణ ద‌గ్గ‌ర బంధువు భార్గ‌వ్ తో అఖిలప్రియ‌కు వివాహం జ‌ర‌గ‌నుంది. శ‌నివారం హైద‌రాబాద్‌లో వీరిద్ద‌రి నిశ్చితార్థం జ‌రిగింది. ఈకార్య‌క్రమానికి వ‌ధూవ‌రుల కుటుంబ స‌భ్యులు, ద‌గ్గ‌రి బంధువులు హాజ‌ర‌య్యారు. ఆగ‌స్టు 29న‌ వీరి వివాహం నిశ్చ‌మైంది. 

akhila priya

భార్గ‌వ్‌, మంత్రి అఖిలప్రియ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇదే విష‌యాన్ని ఇరు కుటుంబాల్లో చెప్ప‌డంతో ఓకే చెప్పారు. దీంతో ఇద్ద‌రి వివాహ‌నికి ఎలాంటీ అడ్డంకులు లేక‌పోవ‌డంతో నిశ్చితార్థం జ‌రిపించారు. వ‌రుడు భార్గ‌వ్ ఏపీ మున్నిప‌ల్ మంత్రి నారాయ‌ణ‌, మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావుకు ద‌గ్గ‌ర బంధువు. 

akhila priya


భూమ అఖిల ప్రియ నిశ్చితార్థంకు ఆమె చెల్లి, త‌మ్ముడే కుటుంబ‌ పెద్ద‌లు కావ‌డం విశేషం. ఏడాది క్రొత్తమే భూమా నాగిరెడ్డి గుండెపోటు మృతి చెందాగా.. అఖిల ప్రియ అమ్మ  శోభానాగిరెడ్డి కారు ఆక్సిడెంట్ లో చ‌నిపోయింది తెలిసిందే. చాలా రోజులు శుభ కార్యం లేని ఇంట్లో అఖిల ప్రియ పెళ్లి నిశ్చ‌యం కావడంతో సంద‌డి నెల‌కొంది. 

Related Post