సూర్యుడు నా కనుసన్నల్లో ఉదయిస్తాడు

news02 July 7, 2019, 6:20 a.m. general

nityananda

మీకు నిత్యానంత స్వామి గుర్తున్నాడు కదా.. సరసకల్లాపాలల్లో మునిగి అడ్డంగా దొరికిపోయిన ఈ స్వామీజీ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. నిత్యానంద స్వామి మరో విచిత్ర ప్రకటనతో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాడు. ఆయన ఏకంగా సూర్య గమనాన్నే శాసించినట్లు చెబుతున్నాడు. నిత్యానంద ఆశ్రమంలో నిత్యం ధ్వజారోహణ చేయడం ఆనవాయితీ. సూర్యోదయ ఉత్తర క్షణమే ఆశ్రమ వ్యవస్థాపకుడు నిత్యానంద ఈ పని చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో వారం రోజుల కిందట నిత్యానంత స్వామి ధ్వజారోహణ చేయడానికి 15 నిమిషాలు ఆలస్యమైంది. ఆ  ఆలస్యాన్ని ఎప్పటిలాగే తనదైన స్టైల్లో చక్కగా సమర్థించుకున్నారాయన.  సూర్యుడు ఆ రోజు 15 నిమిషాలు ఆలస్యంగా ఉదయించాడని.. అందుకే ధ్వజారోహణం ఆలస్యమైందని నిత్యానంద తన భక్తులకు చెప్పుకొచ్చాడు. ఇక ఆయన భక్తులు కూడా నమ్మారనుకొండి. అది పక్కన పెడితే ఇప్పుడీ అంశం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మేఘాలు లేకుండా, ఆకాశం నిర్మలంగా ఉన్న ఆ రోజు సూర్యోదయం ఆలస్యమైందని, పరీక్షించుకోదలచిన వారు గూగుల్‌ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవాలని నిత్యానంద సవాల్‌ కూడూ చేశారు. అదన్న మాట సంగతి.

 

tags: nityananda, nityananda swamy, nityananda about sun, nityananda about sun rise, nityananda swamy comments on sun rice

Related Post