చైర్మెన్ పదవి కోసం ట్రంప్ గారాల పట్టి

news02 Jan. 18, 2019, 8:19 a.m. general

ivanka

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ ప్రపంచ బ్యాంక్‌ చైర్మెన్ పదవికి జరిగే పోటీలో నలబడింది. ప్రపంచ బ్యాంక్‌ ప్రస్తుత చైర్మెన్ జిమ్‌ యంగ్‌ కిమ్‌ ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేస్తున్నారు. జిమ్‌ యంగ్‌ కిమ్‌ మరోక ప్రైవేటు సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో ప్రపంచ బ్యాంక్‌ చైర్మెన్ పదవి కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంక్‌లో అత్యధిక వాటా ఉన్న అమెరికా మద్దతు ఉన్న వారికే అధ్యక్ష పదవి దక్కుతూ వస్తోంది. ఇక ప్రపంచ బ్యాంక్ చైర్మెన్ పదవి కోసం అమెరికా ట్రెజరీ డిపార్టుమెంట్‌కు నామినేషన్ల పర్వం మొదలైంది. 

ivanka

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ సైతం నామినేషన్ దాఖలు చేసింది. ఆమె తో పాటు డేవిడ్‌ మల్ఫాస్‌, నిక్కీ హేలీ వంటి హేమాహేమీల పేర్లు ఈ నామినేషన్లలో ఉన్నాయి. 37ఏళ్ల ఇవాంక ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైన తన తండ్రి ట్రంప్ కు సీనియర్‌ అడ్వైజర్‌గా పనిచేస్తోంది. జులైలో ఆమె తన ఫ్యాషన్‌ బ్రాండ్‌ను మూసివేసి వైట్ హౌజ్ కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి సారించింది. అమెరికా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ప్రపంచ బ్యాంక్ టైర్మెన్ రదవికి పోటీ ఉన్నప్పటికీ అమెరికాయేతరులకు ఈ పదవి అప్పగించే అవకాశాలు లేవనేచెప్పవచ్చు. 

tags: ivanka, ivanka trump, ivanka nomination for world bank chairman, ivanka trump nomination as a world bank chairman

Related Post