ఆమె నన్ను కలవడానికి వస్తుంటుంది..

news02 June 12, 2019, 10:38 p.m. general

sunitha

 

ప్రముఖ గాయని సునీత తెలుసు కదా.. అసలు తానెప్పుడు స్వామీజీని కలవలేదని చెబుతోంది. కానీ ఆ స్వామీజీనేమో సునీత నన్ను కలవడానికి వస్తుందని చెబుతున్నాడు. దీంతో అసలు ఏంజరుగుతోందన్న గందరగోళం నెలకొంది. సునీత ఎంటీ.. స్వామీజీ ఎంటీ అని అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్య విశాఖ శార‌దా పీఠాధిప‌తి శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి ఓ జాతీయ‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. త‌న ద‌గ్గ‌ర‌కు చిరంజీవి, ర‌జినీకాంత్ వంటి ప్ర‌ముఖులతో పాటు.. గాయ‌ని సునీత కూడా వ‌స్తుంటారని చెప్పారు.

sunitha

ఈ వీడియో క్లిప్‌ను సునీత త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. రోజూ చాలా వ‌దంతులు వ‌స్తుంటాయి.. కానీ, కొన్నింటి గురించి త‌ప్ప‌క స్పందించాలి.. స్వరూపానంద సరస్వతి తన వద్దకు వచ్చిన భక్తుల జాబితాలో నా పేరు చెప్పారు.. నేనెప్పుడూ ఆయ‌న‌ను క‌ల‌వ‌లేదు.. ఓ జాతీయ ఛానెల్‌లో మాట్లాడుతూ ఇత‌రుల పేరును ఎలా ఉప‌యోగిస్తార‌ని గాయని సునీత‌ ప్ర‌శ్నించారు. శార‌దా పీఠాధిప‌తి శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తిని ఇప్ప‌టివ‌ర‌కు తాన ఎప్పుడూ క‌ల‌వ‌లేద‌ని ఆమె స్పష్టం చేశారు. అదన్నమాట సంగతి. మరి స్వామీజి అలా ఎందుకు చెప్పారన్నదే ఆసక్తికరంగా మారింది.

 

tags: sunitha, singer sunitha, sunitha about swarupanandendra, singer sunitha about swarupanandendra, singer sunitha comments on swarupanandendra, sunitha swarupanandendra issue

Related Post