ఎవరీ సోనీ-రాహూ-ప్రియ

news02 Sept. 23, 2018, 8:17 a.m. general

poster

రెండు తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య, ఆ తరువాత హైదరాబాద్ లో మాధవిపై తండ్రి హత్యా ప్రయత్నం.. ఇలా పరువు హత్యలు సంచలనం అవుతున్నాయి. కుల సంఘాలు, ప్రజా సంఘాలు పరువు హత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో విజయవాడలో వెలసిని పోస్టర్లు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. బెజవాడ సత్యనారాయణపురంలో రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో హఠాత్తుగా ఓ పోస్టర్లు వెలిశాయి.

poster

ఈ పోస్టర్ల లో .. పరువు హత్యకు గురికానున్న సోనీ రాహూ ప్రియ అంటూ రాశారు. వైట్ పేపర్ పై కేవలం ఈ అంశాన్ని మాత్రమే రాశారు. దీంతో ఇప్పుడు విజయవాడలో కలకలం రేగుతోంది. ఈ పోస్టర్ల లో రాసిన సోనీ, రాహు, ప్రియ ఎవరని అంతా చర్చించుకుంటున్నారు. పరువు హత్యకు గురి కాబోతున్నారని అందులో రాయడంతో.. వీరంతా విజయవాడకు చెందినవారేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక ఈ పోస్టర్ల ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎవరు దీన్ని అంటించి ఉంటారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇది కేవలం ఆకతాయిల పనా.. లేక నిజంగానే ఏదో జరగబోతోందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

tags: poster, sensational poster in vijayawada, suspicious poster in vijayawada, poster on soni rahu priya, police on vijayawada murder poster

Related Post