తన చావు ఖర్చులకు తానే ఖర్చు..

news02 Sept. 24, 2018, 5:53 p.m. general

mother

ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను పోషించడం భారంగా భావిస్తున్నారు పిల్లలు. కొంత మంది పిల్లలైతే తమ దగ్గర కన్నవాళ్లను ఉంచుకోలేక.. ఆనాధాశ్రమంలో ఉంచి.. బతికుండగానే వారిని చంపేస్తున్నారు. మరికొందరైతే కన్నవాళ్లను వాటాలకింద వేసుకుని ఒకరి దగ్గర ఇన్ని రోజులు.. మరొకరి దగ్గర ఇన్ని రోజులని మానసికంగా కృంగదీస్తున్నారు. ఇక చనిపోయిన తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా చాలా మంది పిల్లలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదిగో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఓ తల్లి ఎంతో ముందు జాగ్రత్త పడింది. తాను చనిపోతే తన అంతిమ సంస్కారానికి తన కొడుకు ఇబ్బంది పడకూడదని ముందే ఏర్పాట్లు చేసుకుంది. కొంత డబ్బు పోగేసి తన అంతిమ సంస్కారినికి ఉపయోగించేలా కొడుకుకు చేయూతనిచ్చింది. 

mother

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం మాండ్ర గ్రామంలో జరిగిన ఈ ఘటన అందరిని కంటనీరి పెట్టిస్తోంది. ఈ గ్రామానికి చెందిన వృద్దురాలు లక్ష్మమ్మ తాను చనిపోతే కొడుకుకు భారం కాకూడదని కొంత డబ్బును తాను పడుకునే దిండులో దాచింది. చనిపోయే ముందు మాట్లాడలేని పరిస్థితుల్లో కొడుకుకు పలు మార్లు దిండువైపు సైగ చేసి చూపించింది. అర్దం కాని లక్ష్మమ్మ కొడుకు తల్లి చనిపోయాక దిండు విప్పి చూశాడు. అందులో పాత 500 నోట్లతో పాటు మరి కొంత చిల్లర డబ్బులు దొరికాయి. పాపం పాత నోట్లు రద్దయ్యాయని కూడా లక్ష్మమ్మకు తెలియదు కాబోలు. ఏదేమైనా తన చావు ఖర్చులకు కొడుకు ఇబ్బంది పడకూడదని.. ముందే డబ్బులు దాచి తన తల్లి మనసును చాటుకుంది లక్ష్మమ్మ. ఆమె చేసిన ఈ గొప్ప పనికి కొడుకుతో పాటు.. గ్రామస్తులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఓ మాతృ హృదయమా.. నీకు జోహార్..
 

tags: mother, a mother Spend himself for her death expenses, lakshmamma Spend himself for her death expenses, mother Spend himself for her death expenses in nalgonda

Related Post