పరారిలో గాలి జనార్ధన్ రెడ్డి..

news02 Nov. 8, 2018, 9:12 a.m. general

gali

మైనింగ్ డాన్ గాలి జనార్ధన్‌రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం గాలి జనాఱ్దన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం. గాలి జనార్ధన్ రెడ్డిని పట్టుకోడానికి సీబీఐ బృందాలు రంగంలోకి దిగాయి. అంబిడెంట్ అనే కంపెనీతో గాలి జనార్ధన్‌రెడ్డి తాజాగా  ఒప్పందం కుదుర్చుకోవడమే వివాదానికి కారణమని తెలుస్తోంది. అంబిడెంట్‌ కంపెనీని ఈడీ నుంచి కాపాడేందుకు ఆ కంపెనీతో గాలి డీల్ కుదుర్చుకున్నారుట. ఇందు కోసం ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు పుచ్చుకున్నారట. దీంతో గాలి జనార్ధన్ రెడ్డి కోసం సీబీఐ గాలింపు చటేపట్టింది. ఐతే దీన్ని ముందే పసిగట్టిన గాలి పరారయ్యారని సమాచారం.

tags: gali, gali janardhan reddy, gali janardhan reddy abstand, cbi searching for gali, cbi searching for gali janardhan reddy

Related Post