కళ్ల ముందే సజీవ దహనం

news02 March 11, 2019, 8:56 p.m. general

car fire

 

కళ్ల ముందే భార్య.. ఇద్దరు కూతుళ్లు సజీవ దహనం అయితే పరిస్థితి ఎలా ఉంటుంది. మంటల్లో కాలిపోతున్న తన వాళ్లను రక్షించుకోలేని అసహాయత. హృదయ విధారకమైన ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. దిల్లీలోని అక్షరధామ్‌ పైవంతెన పై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మంటల్లో సజీవదహనమయ్యారు. ఉపేంద్ర మిశ్రా, తన భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి కారులో అక్షర్‌ధామ్‌ వైపుగా వెళ్తున్నారు. అక్షర్‌ధామ్‌ పైవంతెన ఎక్కగానే కారు వెనుక నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే మిశ్రా ఫుట్‌పాత్‌ వైపునకు కారును తీసుకెళ్లారు. ఐతే ఈలోపే కారు మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. కారు నుంచి బయటపడిన మిశ్రా తన పక్క సీట్లో కూర్చున్న చిన్న కూతురిని మాత్రమే బయటకు తీసుకురాగలిగారు. ఎంత ప్రయత్నించినా వెనుక వైపున ఉన్న డోర్లు మాత్రం తెరుచుకోలేదు. ఓవైపు మంటల వేడి వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ వేడికి ఎవ్వరూ దగ్గరకు వెళ్లి కాపాడలేని పరిస్థితి. కారు వెనుక సీట్లలో ఉన్న అతని భార్య, ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. కుటుంబ సభ్యులను కళ్లముందే కోల్పోవడంతో మిశ్రా.. అతని చిన్న కూతురు రోదనలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి.
 

tags: car fire, fire in car, car fire in delhi, 3died in car fire, 3 died in delhi car fire, 3 died in fire car

Related Post