నా సంతోషానికి కారణం నువ్వే

news02 March 14, 2019, 7:24 p.m. general

rishab

ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో గొప్పగా రాణించిన టీమిండియా వికెట్ కీపర్ రిష‌భ్ పంత్‌ ప్రేమలో పడ్డాడట. ఆస్ట్రేలియాలో టెస్ట్ శ‌త‌కం సాధించిన టీమిండియా మొట్టమొదటి వికెట్ కీప‌ర్‌గా, సిరీస్‌లో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్ రికార్డ్ సృష్టించాడు. రిషబ్ పంత్ ఇటీవ‌ల త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో ఒక‌టి వైరల్ గా మారింది. యంగ్ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్, ఎంట్ర‌పెన్యూర్‌ అయిన ఇషా నేగితో స‌న్నిహితంగా ఉన్న‌ ఓ ఫోటోను పంత్ పోస్ట్ చేశాడు రిషబ్ పంత్.  అంతే కాదు నా సంతోషానికి కార‌ణం నువ్వే.. నిన్ను సంతోషంగా ఉంచాల‌నుకుంటున్నా అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఇదే ఫోటోను పోస్ట్ చేసిన ఇషా మై బెస్ట్ ఫ్రెండ్‌, మై సోల్ మేట్‌, మై ల‌వ్‌, మై లైఫ్‌ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇంకేముంది రిషబ్ పంత్.. ఇషా నేగి పీకల్లోతు ప్రేమలో ఉన్నారని వేరే చెప్పాలా...

tags: rishab, rishab love, rishab love affiar, rishab love with isha, rishab affiar with isha negi

Related Post