ఘనంగా క్రిస్మస్ వేడుకలు

news02 Dec. 26, 2018, 7:58 a.m. general

christmass

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగాయి. ప్రపంచ ప్రఖ్యాత వాటికన్‌ సిటీతో పాటు యూరప్‌ దేశాల్లో అంగరంగ వైభవంగా క్రిస్మస్ ను జరుపుకున్నారు. పలు దేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చర్చిలన్నీ విద్యుద్దీపాల వెలుగులో కాంతులీనాయి. భక్తిభావాన్ని ప్రతిబింబించేలా అనేక చోట్ల క్రిస్మస్‌ ట్రీలు ఏర్పాటు చేశారు. వాటికన్‌ సిటీలోని సెయింట్‌  పీటర్స్‌ బసాలిక చర్చిలో సంప్రదాయ వేడుకలను పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రారంభించి సందేశాన్ని వినిపించారు. అందరూ దురాశను విడనాడి..  ప్రేమను, దాతృత్వాన్ని ప్రపంచానికి అందించాలని ఆయన చెప్పారు. 

christmass

క్రిస్మస్‌ పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ సూచించారు. ఇక మొత్తం వారం రోజులపాటు వాటికన్‌ సిటీలో ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఒంగోలు, హైదరాబాద్‌, మెదక్‌ తదితర ప్రాంతాల్లో క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. క్రైస్తవులు పెద్దసంఖ్యలో చర్చిలకు తరలివచ్చి ఏసును స్మరించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 

tags: christmass, christmass elebrations, christmass wishes, mary christmass, christmass celebrations in india

Related Post