ఎక్కడ తీరం దాటుతుందో మరి

news02 Dec. 17, 2018, 7:46 a.m. general

pethai

నిన్నా మొన్ననే రెండు భారీ తుఫాన్లకు అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో తుఫానును  ఎదుర్కోబోతోంది. మరి కాసేపట్లో పెథాయ్ తీరం దాటనుండటంతో.. అధి ఎక్కడ తీరం దాటుతుంది.. దాని ప్రభావం ఎంతమేర ఉంటుందన్నదానిపై అటు ప్రభుత్వ యంత్రాంగానికి.. ఇటు తీర ప్రాంత ప్రజలకు ఆందోళన నెలకొంది. పెథాయ్‌ తుఫాను ఈ  మధ్యాహ్నం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇది ఆ సమయానికి తీవ్ర తుపానుగానే ఉంటుందా లేక బలహీనపడి తుపానుగా మారుతుందా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. తీవ్ర తుపానుగా ఉంటే గాలుల తీవ్రత గంటకి 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పెను తుపానుగా మారిన పెథాయ్‌ తీరానికి దగ్గరగా వస్తుండటంతో ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ముఖ్యమంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ప్రమాదం పొంచి ఉంది. 

pethai

ఈమేరకు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడానికి కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలతో పాటు విద్యుత్తు శాఖకు చెందిన  రెండు వేల మందిని అందుబాటులో ఉంచారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు జాలర్లు చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్నారు. వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గంటకు 28 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న పెథాయ్ తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు వంద కిలోమీటర్లకు చేరడంతో పాటు.. 22 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం కలెక్టర్లు, అధికారులతో తుపాను తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు సీఎం. 

tags: pethai, pethai cyclone, petai cyclone movement, pethai cyclone effect, pethai cyclone speed

Related Post