అందాల నటి శ్రీదేవి కన్నుమూత

news02 Feb. 25, 2018, 6:37 a.m. general

Actor sridevi dead

ముంబై : ప్రముఖ సినీ నటి శ్రీదేవి(54) మృతి చెందారు. దుబాయిలో ఓ పెళ్లికి వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి 11.30 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆమె మరణ వార్తను మరిది సంజయ్ కపూర్ ధృవీకరించారు. శ్రీదేవి వెంట ఆమె భర్త బోనీ కపూర్, కూతురు ఖుషీ దుబాయి వెళ్లారు. ఆమె మరణించిన సమయంలో వారు అక్కడే ఉన్నారు.శ్రీదేవి మృతి చెందిన వార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.దుబాయిలో నటుడు మోహిత్ మార్వా వివాహ వేడుకకు శ్రీదేవి, బోనీకపూర్, ఖుషి కపూర్ హాజరయ్యారు.

Sridevi family1963 ఆగస్టు 13 న తమిళనాడులోని శివకాశి లో ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మా యాంగేర్ అయ్యపాన్. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, బాలీవుడ్ లో శ్రీదేవి తనకంటూ ప్రత్యేక చోటు దక్కించుకున్నారు. అందంతో అప్పట్లో అలనాటి యువత గుండెల్లో చెదరని స్థానాన్ని ఆమె సంపాదించారు. 12 ఏళ్లకే శ్రీదేవి బాలనటిగా తున్నాయినన్ అనే తెలుగు సినిమాతో బాలనటిగా సినీరంగంలోకి అడుగు పెట్టింది. తెలుగులో మా నాన్న నిర్దోషి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు లతో సహా అగ్ర హీరోలు అందరితో ఆమె కలిసి నటించింది. హిందీలో 71 తెలుగులో 75, తమిళ్ లో 76, మలయాళంలో 26, కన్నడం లో 6 సినిమాల్లో శ్రీదేవి నటించారు.

tags: Sridevi dead body, actor sridevi family, heroine sreedevi daughfers, actress sridevi husband, sreedevi cast.

Related Post