తెలంగాణ ఆర్టిసి కి ఫైన్ వేసిన యూజర్స్ ఫోరం

news02 Jan. 28, 2019, 11:31 a.m. general

Users forum fine to tsrtc

నల్గొండ : ఆర్టిసి సిబ్బంది ఎంత దురుసుగా వ్యవహరిస్తారో చాలా మందికి సొంత అనుభవం వుండే వుంటుంది. ప్రయాణికుడు ఏదైనా అడిగితే డ్రైవర్, కండక్టర్ ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారో కూడా అందరికీ తెలిసిందే. చాలా మందికి ఇలాంటి సమస్యలు ఎదురైన పట్టించుకోరు. కానీ ఒక మహిళ కు డ్రైవర్ తో సహా డిపో సిబ్బంది చెప్పిన నిర్లక్షపు మాటలకు ఆమె వినియోగదారుల ఫోరంకు వెళ్లి విజయం సాధించింది.

Users forum shock to tsrtc

నల్గొండ జిల్లాకు చెందిన నర్సింహ రావు, వాణి శ్రీ దంపతులు 2018 ఆగస్టు 18న హైదరాబాద్ లోని ఒక పెళ్లికి హాజరయ్యేందుకు అక్కరి బస్టాండ్ లో సూపర్ లగ్జరి బస్సు ఎక్కారు. బస్సు ఎక్కే సమయంలో మెట్ల దగ్గర పైకి లేచిన రేకు ఆమె పట్టు చీరకు తగిలి చినిగింది. ఆమె వెనకాల బస్సు ఎక్కిన మరో మహిళ చీర కూడా చిరిగింది.ఈ ఈ విషయాన్ని డ్రైవర్ దృష్టికి తీసుకెళ్లారు ఆ దంపతులు. రేకును సరి చేయాలని డ్రైవర్ కు సూచించారు. అది తన పని కాదని.. డిపో లో చెప్పుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. డిపో లో చెప్పినా పట్టించుకోలేదు. దీంతో చిరిగిన చీర, బస్సు మెట్ల దగ్గర పైకి లేచిన రేకు ఫోటోలు సేకరించి వినియోగదారుల ఫోరం కు సమర్పించారు. విచారించిన ఫోరం ఆర్టీసీకి 2వేల రూపాయల జరిమానా, ఖర్చుల కింద మరి వెయ్యి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.

tags: Tsrtc, nagonda depot, users forum address , rtc timings, Telangana etc , rtc bus driver, rtc bus conductor, వినియోగదారుల ఫోరం తెలంగాణ.

Related Post