అభినందన్ హాట్సాఫ్

news02 March 1, 2019, 8:40 p.m. general

sharukh

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ సురక్షితంగా సొంత గడ్డపై అడుగుపెట్టిన తరుణంలో బాలీవుడ్ సెలబ్రెటీలు హర్షం వ్యక్తం చేశారు. అభినందన్‌ను మాృతదేశానికి స్వాగతం పలుకుతూ బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ఓ ట్వీట్‌లో ఆనందం వ్యక్తం చేశారు. సొంతింటికి తిరిగి రావడం కంటే గొప్ప అనుభూతి ఇంకొకటి ఉండదన్న షారుఖ్.. ప్రేమ, ఆశలు, కలల సాకారానికి ఇంటిని మించిన ప్రదేశం మరొకటి లేదన్నారు. మీ సాహసం మమ్మల్ని మరింత బలవంతులను చేసిందని వ్యాఖ్యానించిన షారుక్ ఖాన్.. హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ రియల్ హీరో అని ఈ సినీ హీరో చెప్పారు.

tags: sharukh, shaarukh khan, sharukh khan about abhinandan, sharukh khan about hats off to abhinandan

Related Post