విషాదంలో కుటుంభం

news02 Aug. 29, 2018, 8:04 a.m. general

హరికృష్ణ

నల్గొండ (లోకల్ నెట్ వర్క్)- నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నటుడు- మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా అన్నపర్తి దగ్గర ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. డీవైడర్ ను ఢీకొట్టి పల్టీలు కోట్టడంతో కారు నుజ్జైంది. పల్టీలు కొట్టే సమయంలో కారులోంచి బయటకు పడ్డా హరికృష్ణ తలకు తీవ్రంగా గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే హరికృష్ణను స్థానికులు నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.

హరిక్రిష్ణ

ఇక నందమూరి హరికృష్ణ తలతో పాటు, శరీరానికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణ స్వయంగా కారును నడుపుతున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గతంలో హరికృష్ణ తనయుడు జానకిరాం నల్గొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయిన సంగతి తెలిసిందే.

హరికృష్ణ

ఇక హరికృష్ణ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హరిక్రిష్ణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులు హరికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు నార్కట్ పల్లి లోని కామినేని ఆస్పత్రికి వెళ్లారు.

tags: Harikrishna, harikrishna died, harikrishna road accident, harikrishna no more, harikrishna died in road accident

Related Post