విజ‌య‌న‌గ‌రం జిల్లా భ‌ర్త హ‌త్య కేసులో మాస్ట‌ర్ మైండ్ ప్రియురాలే

news02 May 14, 2018, 11:49 a.m. general

parivatipuram murder

విజ‌య‌న‌గ‌రం: విజ‌య‌న‌గ‌రం జిల్లా స‌ర‌స్వ‌తి భ‌ర్త హ‌త్య కేసులో కొత్త‌కోణాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు ద‌ర్యాప్తులో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. భ‌ర్త శంక‌ర్‌రావును హ‌త్య చేసేందుకు భార్య స‌రస్వ‌తి వేసిన స్కెచ్ ను విన్న పోలీసులు విస్తుపోతున్నారు. భ‌ర్త శంక‌ర్‌రావును హ‌త్య చేసేందుకు మాస్ట‌ర్ మైండ్ ప్లాన్ వేసింది స‌ర‌స్వ‌తేన‌ని తేలింది. ప్రియుడు శివ‌కు భ‌ర్త శంక‌ర్‌రావును ఎలా మ‌ర్డ‌ర్ చేయాలో ఆమె ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. భ‌ర్త ఉండ‌గా ఇద్ద‌రం లేచిపోతే... స‌మాజం ఉమ్మేస్తుంద‌నీ అందుకే భ‌ర్త‌ను అడ్డు తొల‌గించుకుంటే ఇద్ద‌రం సుఖంగా ఉండొచ్చ‌ని శివ‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది. 

murder

భ‌ర్త చ‌నిపోయిన ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత మా కుటుంబీకులు సులభంగా మ‌న పెళ్లికి అడ్డు చెప్ప‌ర‌ని శివ‌తో ఆమె చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా దారిలో దోపిడి జ‌రిగిన‌ట్లు సీన్ క్రియేట్ చేసి ఇద్ద‌రిపై దాడి చేసి.. దాడిలో భ‌ర్థ శంక‌ర్‌రావును లేపేయ‌మ‌ని శివ‌కు స‌ర‌స్వ‌తి సూచించిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో అస‌లు నిజాలు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. 

murder 2

కొద్దిరోజుల క్రితం విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురం ఐటీడీఏ పార్కు వద్ద‌ దంప‌తుల‌పై దాడి.. ఆపై భ‌ర్త హ‌త్య‌కు గురికావ‌డం సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే ఈఘ‌ట‌న‌లో పోలీసుల ద‌ర్యాప్తులో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్లు వెలుగులోకి రావ‌డం ప్ర‌స్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. భ‌ర్త‌ను చంపేందుకు భార్య స‌రస్వ‌తి వేసిన హ‌త్య ప‌థ‌క ర‌చ‌న విధానం వెలుగులోకి రావ‌డం విస్తుగోల్పుతోంది. మామూలు అమ్మాయిలా క‌నిపించే స‌ర‌స్వ‌తి ఇంత‌టి దారుమైన మ‌ర్డ‌ర్ ప్లాన్ చేయ‌డంపై స్థానికులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. 

tags: vizanagarm,murder,sarvasti,shankarrao,policeparvatipooram

Related Post