ఆధార్ అనుసంధానానికి గడువు పెంచిన సుప్రీంకోర్టు

news02 March 13, 2018, 7:37 p.m. general

బ్యాంకు ఖాతాలకు, మొబైల్‌ ఫోన్లకు ఆధార్‌ అనుసంధానంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి డెడ్‌లైన్లు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధార్ తప్పనిసరి అంటూ కేంద్రం బలవంతం చేయడం సరికాదని పేర్కొంది. ఆధార్‌ మాండేటరీ, ఆధార్‌ గోప్యతపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు ఖాతా, మొబైల్‌, తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ లాంటి సేవలకు ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధార్‌ తప‍్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ అనుసంధానానికి మొదట డెడ్ లైన్ ఫిబ్రవరి 28గా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ మార్చి 31 అన్నారు.

అయితే, తాజాగా మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆధార్‌ గడువును నిరవధికంగా పొడిగించింది. దీనిపై కోర్టు తీర్పు వెల్లడించేంతవరకు గడువును పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. అప్పటిదాకా మొబైల్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరేం కాదని తెలిపింది. అయితే సంక్షేమ పథకాలు, సేవలు, రాయితీలకు మాత్రం ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానించాలని.. ఆ నిబంధన కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది.

 

tags: supremecourt, aadharcard, bankaccounts, linking, mobile

Related Post