రైలు కింద ప‌డి దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

news02 Feb. 22, 2018, 12:37 p.m. general

అమ్మా...నాన్నా ఏమ‌య్యారో తెలీదు.. క‌ళ్ల ముందు క‌న‌బ‌డ‌క‌.. ఓ చిన్నారి గుక్క పెట్టి ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి.. అలిసిపోయింది. తెలియ‌ని వారెవ‌రో నిద్ర‌పుచ్చితే  ఆద‌మ‌రిచి నిద్ర‌పోయింది. ఆ బిడ్డకి  తెలియ‌నిదేమిటంటే   అమ్మానాన్న రైలు కింద ప‌డి చ‌నిపోయార‌ని.. ఇంకెప్పుడూ తిరిగి రార‌ని. మెద‌క్ జిల్లా బ్రాహ్మ‌ణ‌ప‌ల్లిలో విషాదం చోటు చేసుకుంది. కూతురిని ఫ్లాట్ ఫామ్ పై వ‌దిలిపెట్టి దంప‌తులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. రైలు ప‌ట్టాల‌పై త‌ల్లిదండ్రుల మృత‌దేహాలు.. ఫ్లాట్ ఫామ్ పై ఏడుస్తూ వారి ప‌సిపాప ..ఈ దృశ్యం చూసిన ప్ర‌తి ఒక్క‌రి క‌ళ్లూ చ‌మ్మ‌గిల్లాయి. 

కామారెడ్డికి చెందిన కాశీరాంకి  ఏం స‌మ‌స్య వ‌చ్చిందో.. త‌న కూతురిని ఫ్లాట్ ఫామ్ పై వ‌దిలిపెట్టి భార్య‌తో క‌లిసి రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌ల్లిదండ్రులు చ‌నిపోవ‌డంతో ఆమె కూతురు అనాధ‌లా మారింది. ఫ్లాట్ ఫామ్ పై గుక్క‌పెట్టి ఏడుస్తున్న చిన్నారిని చూసి స్ధానికులు చ‌లించిపోయారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

రైలు ప‌ట్టాల‌పై  దొరికిన ఆధార్ కార్డుల ద్వారా  పోలీసులు మృతుల వివ‌రాల‌ను గుర్తించారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

 

tags: kamareddy, suicide, medak, death, telangana

Related Post