పవన్ కు క్రిస్మస్ గిఫ్ట్

news02 Dec. 25, 2018, 9:05 a.m. general

varun

పవన్‌కల్యాణ్‌ తన సోదరుడు నాగబాబుకు, ఆయన తనయుడు వరుణ్‌ తేజ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. నాగబాబు, వరుణ్ తేజ్ జనసేన పార్టీకి విరాళం ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేశారు పవన్‌ కళ్యాణ్. జనసేన పార్టీకి కోటి రూపాయల విరాళం ఇచ్చిన వరుణ్‌తేజ్‌కు, 25 లక్షల రూపాయలు ఇచ్చిన నాగబాబుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పనన్ చెప్పారు. ఇది పార్టీకి క్రిస్మస్‌‌ బహుమతిలా వచ్చిందన్న పవన్... మీరిద్దరూ విరాళాలు అందించడం చాలా సంతోషంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ఇక తాను యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దర్ని కలిసి కృతజ్ఞతలు తెలుపుతానని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పష్టం చేశారు.

 

tags: varun, varun tej, varun tej donation to janasena, nagababu donation to janasena, varuntej one crore donation to janasena, pawan kalyan thanks to nagababu, pawan kalyan thanks to varun tej

Related Post