సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

news02 Feb. 27, 2018, 11:13 a.m. general

శ్రీదేవిని హత్య చేశారంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవి బస చేసిన హోటల్  రూం సీసీ ఫుటేజ్ ని దుబాయ్ పోలీసులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శ్రీదేవి ఉన్న రూంలోకి రాత్రి ఎవరెవరు వెళ్లారో కూడా చెప్పాలన్నారు. మద్యం తాగడం అలవాటు లేని శ్రీదేవి బాడీలో ఆల్కహాల్ ఎలా ఉందో చెప్పాలని ప్రశ్నించారు. శ్రీదేవితో బలవంతంగా ఎవరైనా తాగించారా? అన్నది కూడా బయటపెట్టాలని కోరారు. మరోవైపు సినీ తారలతో దావూద్ ఇబ్రహీంకు ఉన్న సంబంధాలపై కూడా విచారణ చేపట్టాలని సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలు ఒక్క సుబ్రహ్మణ్య స్వామినే కాదు.. కోట్లాదిమంది హృదయాల్ని తొలిచేస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పటికి తెలుస్తుందన్నది ప్రశ్నగానే మారింది.

tags: sridevi, death, mystery, subrahmanyaswami, bjp, politics

Related Post