తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఘటన..

news02 Sept. 23, 2018, 7:34 p.m. general

maoists

మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. ఆంద్రప్రదేశ్ విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్ రావు ను దారుణంగా హతామార్చారు మావోయిస్టులు. ఈ కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ సైతం చనిపోయారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అరకు నియోజకవర్గాం డబ్రీగూడ మండలం లిప్పిట్టిపుట్ట దగ్గర మావోయిస్టులు వీరిపై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దాడి ఘటనలో సుమారు 60మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యే పై దాడి చేసిందే మావోయిస్టులేనని విశాఖ ఎస్పీ రాహూల్ దేవ్ నిర్ధారించారు. ఇక ఏవోబి కార్యదర్శి రామకృష్ణ ఆద్వర్యంలో ఈ దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

araku

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఉదయం 11 గంటల వరకూ అరకులోనే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే సివేరు సోమతో కలిసి నిమిటిపుట్టు గ్రామానికి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారట. అక్కడ స్థానికులతో మాట్లాడుతుండగా సుమారు 60 మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న విషయాలపై వారు ఎమ్మెల్యేతో దాదాపు గంటసేపు చర్చించారని స్థానిక వర్గాల సమాచారం. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు చెందిన గూడ క్వారీపై మావోయిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ క్వారీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నందున మూసివేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేశారని తెలుస్తోంది. దీనిపై ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్ రావు స్పందిస్తూ.. ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. బెదింపులకు దిగడం సరికాదని మావోసపై ఆగ్రహం వ్యక్తం చేశరట. దీంతో మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోముకు తుపాకుల ఎక్కుపెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపారని స్థానికులు చెబుతున్నారు. దీంతో వారిద్దరు వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

babu

ఇక అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే సోమ ను మావోయిస్టులు హతమార్చడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వెంటనే విశాఖ నుంచి బలగాలను అరకులో మోహరించారు. అమెరికా పర్యటనో ఉన్న సీఎం చంద్రబాబు ఘటనపై ఆరా తీశారు. మరోవైపు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బంధువుల, అనుచరులు స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. పోలీసు వైఫల్యం వల్లనే తమ నాయకులు చనిపోయారని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

tags: ఎమ్మెల్యేను హతమార్చిన మావోయిస్టులు, kf[ejf sarveshwar rao died, araku mla kidari sarveshwar rao died, maoists fire on araku mla, maoists fire on kidari sarveshwar rao, maoists fire on ex mla soma

Related Post