కీచక ప్రొఫెసర్ పై వేటు పడింది

news02 July 8, 2019, 10:03 p.m. general

ravi

నిర్మల్‌ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ ఐటీ లో పనిచేస్తున్న కీచక ప్రొఫెసర్‌ రవి పై ఎట్టకేలకు వేటు పడింది. కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న రవిని సర్వీసు నుంచి తొలగించినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అశోక్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులనే రవి ప్రధానంగా టార్గెట్‌ చేసుకుని.. మార్కుల కోసం లైంగికంగా వేధించేవాడని విచారణలో తేలింది. 4నెలల క్రితం రాత్రివేళలో అతడు విద్యార్థినులతో ఏకాంతంగా ఉండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. 20 రోజుల క్రితం రవి ఓ అమ్మాయిని కారులో తీసుకెళ్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఇది నా వ్యక్తిగత విషయం.. మీరు కల్పించుకోవద్దని బాహాటంగా చెప్పడం గమనార్హం. విద్యార్థినులను బయటకు తీసుకెళ్లే ముందు రవి వారి నెలసరి వివరాలను అడిగేవాడని వర్సిటీ అధికారులు తెలిపారు.  సాధారణంగా నెలసరి తర్వాత 13, 14, 15 రోజుల్లో గర్భం దాల్చే అవకాశం ఉండటంతో.. రవి జాగ్రత్తలు తీసుకునేవాడని తెలుస్తోంది. రవి వ్యవహారంలో వర్సిటీకి చెందిన మరో వ్యక్తి పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మెసేజ్‌లు పంపిన విద్యార్థినితో పాటు మరో ఇద్దరు బాధిత విద్యార్థినులు అధికారుల ఎదుట అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అరాచకాల గురించి చెప్పినట్లు తెలుస్తోంది. విద్యార్థినులకు నెలసరి వివరాల కోసం ఛాట్‌ చేయడం.. విద్యార్థినులను నెలసరి అయిన తరువాతే తన వద్దకు పిలిపించుకునే వాడని చాటింగ్‌ను బట్టి తెలుస్తోంది.

tags: ravi, prof ravi, prof ravi sexual harrassment, prof ravi sexual harrassment in basara iiit, sexual harrassment in basara iiit, professor sexual harrassment in basara iiit

Related Post