సామాన్యుడు పెళ్లికి అనుకోని అతిథిగా వెళ్లిన కేసీఆర్

news02 May 10, 2018, 2:13 p.m. general

Cm kcr visit common man marriage
క‌రీంన‌గ‌ర్: పెళ్లి అంటేనే పండ‌గ‌. జీవితంలో అదో మ‌ధురానుభూతి. మ‌ర‌చిపోని జ్ఞాప‌కాలు, మ‌ధుర స్మృతులు. ప్ర‌తి సంవ‌త్సరం ఎన్ని పండ‌గ‌లు చూసినా... జీవితంలో జ‌రిగే పెళ్లి వేడుక‌ను ఎవ‌రైనా ఘ‌నంగా జ‌రుపుకోవాల‌నుకుంటారు.  కుటుంబ స‌భ్యులు, బంధువులు, సేహ్నితులు, ఇలా ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌కుండా.. పెళ్లికి ఆహ్వానిస్తాం. అంద‌రి స‌మ‌క్షంలో పెళ్లి వేడుక‌ను అంగ‌రంగ వైభ‌వంగా చేసుకుంటాం. ఊర్లో ఉన్న లీడ‌ర్లంద‌రిని పిలిచి పెళ్లిని గొప్ప‌గా జ‌రుపుకుంటాం. ఏవ‌రైనా బంధువులు, లీడ‌ర్లు రాక‌పోతే వెలితిగా ఫీల‌వుతుంటాం. పెళ్లి సంద‌ర్భంగా అంత‌లా ఫీల‌య్యే మ‌నం.. పెళ్లికి పిలువ‌ని గొప్ప నాయ‌కుడు వ‌స్తే ఎలా ఉంటుంది. అదీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌చ్చి న‌వ దంప‌తులును ఆశీర్వ‌దిస్తే ఎలా అనిపిస్తోంది. ఇకేముంది జీవితాంతం ఆమ‌ధురానుభూతుల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేం. అచ్చం ఇలాగే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓ పిల‌వ‌ని పెరంటానికి వెళ్లి వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వదించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 


ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతు బంధు ప‌థ‌కం కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు క‌రీంన‌గ‌ర్ జిల్లా హూజురాబాద్ వెళ్లుతుండ‌గా ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ ఉద‌య‌మే రైతు బంధు ప్రోగ్రాంలో పాల్గొనేందుకు బ‌స్సులో హూజురాబాద్ వెళ్లుతున్నారు. ఆయ‌నతో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్‌, అధికారుల బృందం ఉన్నారు. అయితే  రోడ్డుపై వెళ్లుతున్న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప‌ని అధికారుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. కేసీఆర్ ఒక్క‌సారిగా కాన్వాయి ఆపించి ర‌హ‌దారి ప‌క్క‌నున్న పెళ్లికి వెళ్లారు. 

cm kcr 3

త‌డిక‌ల్ వ‌ద్ద‌ రోడ్డుపై జ‌రుగుతున్న పెళ్లికి ముఖ్య‌మంత్రి వెళ్లి వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. అయితే ముఖ్య‌మంత్రి పెళ్లికి రావ‌డంతో.. వ‌ధూవ‌రులు ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. మామూలుగా ఊరి స‌ర్పంచ్‌, మండ‌ల నాయ‌కుడు వ‌స్తే చాల‌కున్న వారికి... ఏకంగా ముఖ్య‌మంత్రి రావ‌డంతో సంబ‌ర‌ప‌డ్డారు. పెళ్లికి పిలువ‌కున్న గొప్ప మ‌న‌స్సుతో పెళ్లికి వ‌చ్చి త‌మను ఆశీర్వ‌దించ‌డంపై వ‌ధూవ‌రులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 

tags: cm,kcr,rythubandhu,marraige,bridegroom,huzurabad,tadkal,etela

Related Post