మహిళల మనోభావాలతో ఆడుకున్న టీఎస్ పీఎస్సీ

news02 Sept. 16, 2018, 4:54 p.m. general

Tspsc

మన హిందు సాంప్రదాయంలో వివాహ బంధానికి చాలా గౌరవం ఉంది. ప్రపంచ దేశాలు సైతం మన హిందు వివాహ సంప్రదాయాన్ని ఎంతో గౌరవిస్తాయి. ఇక వివాహ బంధం లో మంగళ సూత్రానికున్న విలువ.. ప్రాముఖ్యత గురించి వేరే చెప్పక్కర్లేదు. ఒక్కసారి వధువు మెడలో మంగళ సూత్రం పడ్డాక.. అది వాళ్ళు చనిపోయే వరకు.. లేదంటే భర్త చనిపోయే వరకు తియ్యారు. అంత పవిత్రంగా.. పద్దతిగా చూసుకుంటారు మంగళ సూత్రాన్ని. కానీ అంతటి పవిత్రమైన మంగళసూత్రాన్ని టీఎస్ పీఎస్సీ అధికారులు అపహాస్యం చేశారు. ఈరోజు జరిగిన విఆర్వో పరీక్ష సందర్బంగా సందర్భంగా మహిళల మంగళసూత్రాలను పరీక్షా కేంద్రాలకు అనుమతించ లేదు.

Tspsc

ప్రతి మహిళను మంగళసూత్రాలను తీసేసి పరీక్షా కేంద్రం లోపలికి రమ్మనడంత్తో అంతా అవాక్కయ్యారు. ముందు ఏమి చేయాలో వారికి పలుపోలేదు. మంగళసూత్రాల పవిత్రత గురించి అధికారులకు చెప్పినా అర్థం చేసుకోలేదు. దీంతో ఉద్యోగం కోసం చేసేది లేక.. విధిలేని పరిస్థితి లో మంగళసూత్రాలను తీసి వారి వెంట వచ్చిన భర్తలకు, లేదంటే తల్లిదండ్రులకు ఇచ్చి పరీక్ష రాయడానికి లోపలకు వెళ్లారు మహిళలు. మంగళసూత్రాలలో కాపీ కొట్టడానికి చిట్టీలు పెట్టుకుంటారని అధికారుల అనుమానం. మంగళసూత్రాలలో చిట్టీలు ఎలా పెట్టుకుంటారో మన టీఎస్ పీఎస్సీ అధికారులకె తెలుసు. ఏదేమైనా ఇలా పవిత్రమైన మంగళసూత్రాలను తీయించడపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

tags: Tspsc, vro exam, tspsc vro exam, tspsc over action, tspsc over action in vro exam, mangala sutra removed in vro exam,

Related Post