కేరళ.. కేరళ.. డోంట్ వర్రీ

news02 Aug. 22, 2018, 3:22 p.m. general

rahaman

అమెరికా (ఇంటర్నేషనల్ డెస్క్)- గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేరళ అతలాకుతలం అయ్యింది. దాదాపు రాష్ట్రమంతా స్థంబించిపోయింది. జనజీవనం అస్థవ్యస్తం అయ్యింది. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా చాలా వరకు గ్రామాలు వరదలోనే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ కేరళ ప్రజల కోసం ప్రత్యంకగా ఓ పాటను అంకితం ఇచ్చారు. ప్రేమదేశం సినిమాలోని ముస్తఫా ముస్తఫా పాటకు పేరడిగా కేరళ.. కేరళ.. డోంట్ వర్రీ కేరళ అంటూ కొత్త పాటను ఆలపించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రహెమాన్.. అక్కడే పాటను కంపోజ్ చేసి కేరళ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. కేరళ వాసులకు దైర్యం చెప్పే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 

tags: rahaman, ar rahaman, rahaman song, rahaman song for kerala, ar rahaman song for kerala, ar rahaman song for kerala floods, rahaman kerala kerala song, kerala kerala dont worry kerala

Related Post