ఫేస్‌బుక్ చూసి ఇంటి పంట‌లు సాగు చేస్తున్న రైల్వే అధికారి

news02 May 8, 2018, 6:01 p.m. general

tellars vegtables
హైద‌రాబాద్: ఆలోచ‌న, ప్రేర‌ణ‌, సృజ‌నాత్మ‌క‌త ఉండాలే కానీ, చ‌క్క‌ని ఫ‌లితాలు రాబ‌టోచ్చ‌ని నిరూపించారు రైల్వే  హింది రిటైర్డ్ అధికారి ప‌ద్మావ‌తి. సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌ను అంద‌రూ టైంపాస్‌కు వాడుతుంటే ఈమె మాత్రం అందులో ప‌లువురు చేసిన సూచ‌న‌ల ఆధారంగా మంచి ఫ‌లితాలు పొందుతున్నారు. ఎలాంటీ వ్య‌వ‌సాయ భూమి లేకున్నా.. త‌మిళ‌నాడు టెర్ర‌స్ గార్డెన్ గ్రూప్ యొక్క ఫేస్ బుక్ పేజి స‌హ‌కారంతో ఇంటి పంట‌లను సాగు చేస్తున్నారు. ప‌లు ర‌కాల కూర‌గాయాల‌ను ఇంటి టెర్ర‌స్‌పై పెంచుతూ... ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. 

terras vegitables

సికింద్రాబాద్ నేరేడ్ మెట్ కృపా కాంప్లెక్స్‌లో నివాస‌ముంటున్న ప‌ద్మావ‌తి త‌న ఇంటిని... ఇంటి పంట‌ల సాగుకు హ‌బ్ మార్చేశారు. వేద భవ‌న్ గోశాల నుంచి ఆవు పేడ తెచ్చి, దానికి చెరువు మ‌ట్టి, కొబ్బ‌రి పొట్టు క‌లిపి సిమెంట్ కుండీలు త‌యారు చేయించారు. ప్లాస్టిక్, పాల్పిన్ క‌వ‌ర్లతో బెడ్స్ ఏర్పాటు చేసి కూర‌గాయాల సాగు చేస్తున్నారు. వంగ , టామాట, సొర‌కాయ‌, ఆకుకూర‌లు, పూలు సాగు చేస్తున్నారు. ఇంటికి స‌రిపోగా కూర‌గాయాలు, ఆకుకూర‌లు మిగిలిపోతున్నాయ‌ని ప‌ద్మావ‌తి చెబుతున్నారు. కొద్ది నెల‌ల క్రితం నేల‌లో వేసిన సొర పాదుగ పందిరిపైకి పాకి 40 సొర‌కాయాలు కాసిందంటున్నారు. 

terras vegitables

ప‌ద్మావ‌తి కొద్ది కాలం క్రిత‌మే రైల్వే హిందీ అధికారిగా ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. ఇంటి వ‌ద్ద ఏదైనా చేయాల‌ని భావించిన ఆమెకు.. ఫేస్‌బుక్ ద్వారా ఓ కొత్త ఆలోచ‌న వ‌చ్చింది. త‌మిళ‌నాడు టెర్ర‌స్ గార్డెన్ గ్రూప్ వారు త‌మ ఫేస్‌బుక్‌లో ఇంటి పంట‌ల సాగు గురించి ఇచ్చిన స‌మాచారం ఆక‌ట్టుకుంది. ఇంటి ప‌నుల నిపుణులు క‌ర్రి రాంబాబు, త‌మ్మేట ర‌ఘోత్త‌మ‌రెడ్డి ఇచ్చిన సూచ‌న‌లు పాటిస్తూ.. ఇంటి పంట‌ల సాగును ప్రారంభించారు. ఫ‌లితంగా ఇప్పుడు ఆమె అధిక కూర‌గాయాల దిగుబ‌డిని సాధిస్తూ మంచి ఫ‌లితాల‌ను పొందుతున్నారు. 

ఫేస్‌బుక్ ప్రేర‌ణ‌తో ప‌ద్మావతి ఇంటి టెర్ర‌స్‌పై కూర‌గాయాల సాగు చేయ‌డాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. చాలా మంది సోష‌ల్ మీడియాను ఇష్ట‌వ‌చ్చిన‌ట్లు వాడుతుంటే.. ప‌ద్మావ‌తి మాత్రం అందులో టెర్ర‌స్ గార్డెన్ గ్రూప్ ఇచ్చే సూచ‌న‌లు పాటించి కూర‌గాయాల సాగు చేసి స‌క్సెస్ కావ‌డం గొప్ప విష‌య‌మంటున్నారు. 

ప‌ద్మావ‌తి సెల్:9989839950

tags: padmavati,terrasvegitabales,neredmet,facebook,vanfa

Related Post