భారీ నుంచి అతి భారీ వర్షాలు

news02 Dec. 14, 2018, 8:31 a.m. general

cyclone

ఇప్పటికే పలు తుఫాన్లతో అల్లాడిపోయిన ఆంద్రప్రదేశ్ కు మరో తుఫాను ముప్పు ముంచుకొచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారి రానున్న 3, 4 రోజుల్లో రాష్ట్రం వైపుగానే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది. వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో మచిలీపట్నానికి 1250 కిలోమీటర్లు, చెన్నైకి 1080కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలీ  780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తీవ్రంగా మారి శుక్ర, శనివారాల్లో తుపానుగా రూపందాల్చనుందని అంచనా వేస్తున్నారు.

cyclone 

ఆ తర్వాత 3 రోజుల్లోపు వాయువ్యదిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం గంటకు 100కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వరకు గాలులు వీయనున్నాయి. ఈ తీవ్రవాయుగుండం, తుపాను ప్రభావాలతో ఏపీలో 15వ తేదీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, 16వ తేదీ ఈ నాలుగు జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో, 17వ తేదీ కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

tags: vayugundam, vayudundam in bay of bengal, cyclone , heavy cyclone, cyclone in bay of bengal, low pressure in bay of bengal

Related Post